చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || Discover more Telugu song lyrics → movirock.com/lyrics
for More songs visit https://movirock.com