Skip to main content

Posts

Showing posts with the label విహారి

Munnar ప్రకృతి అందాల నెలవు - మున్నార్

ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ప్రకృతిలో అందాలన్నీ ఇక్కడికి తెచ్చి కోప్పపోసినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు, ప్రతి రెప్పపాటులో తను చుసిన ఈ అందాలను జీవితాంతం నెమరువేసుకుంటూనే ఉంటాడు. ముద్రపూజ,నల్లతాని,కుందాళ అనే మూడు నదుల సంగమం అని ఈ ప్రదేశాన్ని ఇక్కడి స్థానికులు “మూన్ ఎర్రా” మూడు సెలయేళ్ళు అని పిలుస్తారు. వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. సంవత్సరమంతా ఇక్కడ వర్షం కూరుస్తునేవుంటుంది. మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయో, ఎప్పుడు కౌగిలిస్తాయో అస్సలు అర్థం కాదు. వర్షం కూరుస్తున్నప్పుడు ఇక్కడి లోయల్లో వర్షపు జల్లు అందించే సింఫనీకీ ప్రకృతి సైతం మైమరచి నాట్యం చేస్తుంది. ఇక్కడి కొండలపై వుండే వాతావరణం తేయాకు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. తేయాకు పెంపకందారులు గోల్ఫ్, టెన్నిస్, ఫిషింగ్ లాంటి వ్యాపకాలను బాగా ఇష్టపడతారు. ఇక్కడి టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉంటాయి. చూడదగిన ప్రదేశాలు: నీలగిరి తార్: ఇక్కడి ఎరావికులం జాతీయ పార్క్ లో నీలగిరి తార్ అనబడే అరుదైనా జంతువును  చూడవచ్చు. ఈ జంతువు రాష్ట్ర అటవీ శాఖ, మున్నార్ లోని టీ తోటల యజమానుల నుండి  రక