Skip to main content

Posts

Showing posts with the label sirivennela

Khabadarani Song Lyrics - Athidi Movie

చిత్రం: అతిథి (2007) సంగీతం: మణిశర్మ గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: నవీన్, రాహుల్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఖతం ఖతం ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో వగలమారిని తగలబెట్టారా వగలుపుట్టాదా నడి రాత్రిల్లో ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిరికిగ పరుగుతీస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పొగరుగ పోరు చేస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ నలుగున నక్కి ఉంటావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ ఎవరికి చిక్కనంటావా యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా చరణం 1: ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖాతం ఖేల్ ఖతంఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో చరణం 2: Dont ever mess with me.. I'm gonna break u down That way... Thats the way! నీ పేరే సమర శంఖమై విన్పించని విద్రోహికి ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించని అపరాధికి ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడకిలి ఎత్తి శాసించు ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడుగుని పట్టి బంధించు యుధ్ధం తప్పదంటే బతుకు పద్మవ్యూహమంతే ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండె...

Oura ammaku chella Song Aapadbhandavudu Movie

చిత్రం: ఆపద్భాంధవుడు (1992) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా చరణం 1: ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా చరణం 2: ఆలమంద కాపరిలా కనిపించ...

Kavali Kavali Nene Nee Lokam Kavali |కావాలి..కావాలి... మొగుడు.. - Mogudu Movie

చిత్రం: మొగుడు గాయకులు: మధుమిత, బాబు శంకర్ రచయిత: సిరివెన్నెల సంగీతం: బాబు శంకర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా అవ్వాలి... మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి... ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి.... వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... ఇంట్లో... వుంటే... కొంగు వదలవని... /2/ తిట్టే విరసం కావాలి..... గడప దాటితే ఇంకా రావని కొట్టే విరహం కావాలి.. నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి... ఆవునో కాదో అనుమానంతో నేనే మేలుకొని వుండాలి... నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి... అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి... కావాలి..ఆఈ ....ఈ ..ఈ.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... చీకటినైన చుడనివ్వనని ... చీకటినైన చుడనివ్వనని చేరి నన్ను చుట్టేయ్యాలి .... చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి .. న...

Eduta Nilichindi Choodu | ఎదుట నిలిచింది చూడు.... Vana Movie

    Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ అవునో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు