Skip to main content

Posts

Showing posts with the label స్వగతం

Love in Amsterdam

  ఇది ఒక ప్రేమ కథ ... అమ్ స్టర్ డ్యాం లో జరిగింది.  అమ్ స్టర్ డ్యాం అంటే అందరికి గుర్తుకు వచ్చేది ... tulips... daffodils... అందమైన పువ్వులు... కానీ ఇది చదివిన తరువాత అక్కడ జరిగిన ఈ ప్రేమ కథ... మాత్రమే గుర్తుకొస్తుంది. నేను M.S(Software Engineering) ని UK లో చేస్తున్నాను. UK ఉండి లో 8 నెలలు అవుతుంది. అక్కడ ఉన్న అన్నీ  రోజులు ఇండియా కి ఎప్పుడు వెళ్తానో అనిపించేది. నేను చాలా మందిని చూశాను. ఒక్కొకరు రెండు, మూడు సంవత్సరాల నుండి ఇండియాకి వెళ్ళని వారిని, అయినవాళ్ళు ఎలా ఉంటారో అనిపించింది. నేను Edinburgh (UK)  నుంచి ఇండియా కి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అంటే ఎంత సంతోషమో చెప్పలేను.అది వేరే దేశం లో వుండే వారికీ ఖచ్చితంగా తెలుసు. నేను KLM Travels  లో టికెట్ బుక్ చేసుకున్నాను. నా ప్రయాణం Edinburgh to Amsterdam to Hyderabad మీదుగా సాగింది. Edinburgh నుంచి Amsterdam కి గంటన్నర ప్రయాణం. విమానం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. అందమైన ఎయిర్ హోస్టెస్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చింది. అది తింటూ వుండగానే Amsterdam వచ్చింది. Schiphol Airport, Amsterdam లో రెండు గంటల waiting. హైదరాబాద్ విమానం 2 గంటల తరువాత బయలు

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... from HitSongs.in

వేసవి కాలం  సాయంకాలం పూట, ఇంట్లో ఊక్కపోతగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుంది.... అలా బయట వసారాలో కూర్చుని టి.వి చూస్తుని వున్నాను. ఈ రోజు జరగాల్సిన IPL మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది. అలా అన్నీ చానల్స్ మారుస్తున్నపుడు, మా మూవీస్ టి.వి. ఛానల్ లో “ నిన్నే పెళ్ళాడతా” సినిమా వస్తూవుంది. ఒక పాట వినిపించింది .. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను... కానీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట అది..... “ఎటో వెళ్లి పోయింది మనసు”... అది వినగానే నా మనసు ఎటో వెళ్లి పోయింది... ఇలా వెళ్లటం మొదటి సారి ఏమి కాదులే గాని... ఈ పాట విన్నపుడు మాత్రం....నిజం గానే ... ఎక్కడికో వెళ్ళిపోతాను... వెంటనే గిటార్ తీసి కొంచెం సేపు అలా మీటుతూ, పాడి పరవశించి పోయాను... సీతారామశాస్త్రి సాహిత్యం, సందీప్ చౌతా సంగీతం, రాజేష్ గానం,  కృష్ణ వంశీ దర్శకత్వం, నాగార్జున – టబు ల అభినయం వెరసి.... ఒక చక్కటి పాట.... మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యం గా వయసులో ఉన్న ఒంటరి వాళ్లు ఉహల్లో  ఎటేల్తారో  మీ ఊహలకే వదిలేస్తున్నాను. అలా పాట మొత్తం విన్నాకా... లిరిక్స్ రాయాలి అనిపించింది... సీతారామశాస్త్రి గారు ఈ పాట ఎలా వ్రాసారో తెలియదు గాని... నిజంగా