ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ప్రకృతిలో అందాలన్నీ ఇక్కడికి తెచ్చి కోప్పపోసినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు, ప్రతి రెప్పపాటులో తను చుసిన ఈ అందాలను జీవితాంతం నెమరువేసుకుంటూనే ఉంటాడు. ముద్రపూజ,నల్లతాని,కుందాళ అనే మూడు నదుల సంగమం అని ఈ ప్రదేశాన్ని ఇక్కడి స్థానికులు “మూన్ ఎర్రా” మూడు సెలయేళ్ళు అని పిలుస్తారు. వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. సంవత్సరమంతా ఇక్కడ వర్షం కూరుస్తునేవుంటుంది. మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయో, ఎప్పుడు కౌగిలిస్తాయో అస్సలు అర్థం కాదు. వర్షం కూరుస్తున్నప్పుడు ఇక్కడి లోయల్లో వర్షపు జల్లు అందించే సింఫనీకీ ప్రకృతి సైతం మైమరచి నాట్యం చేస్తుంది. ఇక్కడి కొండలపై వుండే వాతావరణం తేయాకు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. తేయాకు పెంపకందారులు గోల్ఫ్, టెన్నిస్, ఫిషింగ్ లాంటి వ్యాపకాలను బాగా ఇష్టపడతారు. ఇక్కడి టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉంటాయి.
చూడదగిన ప్రదేశాలు:
నీలగిరి తార్: ఇక్కడి ఎరావికులం జాతీయ పార్క్ లో నీలగిరి తార్ అనబడే అరుదైనా జంతువును చూడవచ్చు. ఈ జంతువు రాష్ట్ర అటవీ శాఖ, మున్నార్ లోని టీ తోటల యజమానుల నుండి రక్షిత జంతువుగా ప్రకటించబడింది.
అనముడి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి ఎత్తైన శిఖరమిది. ఇక్కడికి 40కీ.మీ దూరంలో ఉన్న యరయూర్ లోని చందనపు అడవులు,తూవనం జలపాతాలు పర్యాటకులను ప్రతి ఏట ఆహ్వానిస్తుంటాయి. ఇక్కడికి 60కి.మీ దూరం లో ఉన్న చిన్నార్ వైల్డ్ స్యాంక్చురీ దేశంలో ప్రముఖమైనది. దీనిలో ఏనుగులను, జింకలను,సాంబ వగైరా జంతువులను చూడవచ్చు.
పర్వతారోహణ: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి ఎత్తైన శిఖరమైన అనముడి మూడు గంటల పర్వతారోహణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. పర్వతారోహణ మొదలయ్యే ప్రాంతాన్ని న్యామకడ్ అని పిలిస్తారు. అనముడి అనగా ఏనుగు తల అని అర్థం.
పక్షి వీక్షణ: పచ్చటి మున్నార్ వాలులు, కొండపై నిండివున్న అటవీ ప్రాంతం ఎన్నో రకరకాల పక్షులకు నివాసస్థలం. పక్షి పరిశోదకులు ప్రతి ఏట మున్నార్ ను దర్శిస్తువుంటారు.
ఎకో పాయింట్: నదీ తీరాన ఒక వైపు అందమైన చెట్లతో, మరొకవైపు పచ్చిక బయళ్ళతో నిండి ఉన్న ఈ ప్రాంతం చూడదగింది.
వాతావరణం: చలికాలం లో చలి తీవ్రంగా ఉంటుంది. వేసవి లో కొంత చల్లగా ఉంటుంది.
దర్శించటానికి తగినకాలం: మే నుండి అక్టోబర్ వరకు.
దరించతగినవి: చలికాలం లో మందపాటి ఉన్ని దుస్తులు అవసరం.
వాడుక భాషలు: మలయాళం, తమిళం, ఇంగ్లీష్.
ట్రాన్స్ పోర్ట్:
వాయుమార్గం: మున్నార్ నుండి 130 కి.మీ దూరం లో కొచ్చిన్ విమానాశ్రయం ఉంది.
రైలు మార్గం: దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కోచ్చిన్ 130 కి.మీ.
రోడ్డుమార్గం: ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి 4 గంటలు బస్సు ప్రయాణం లేదా కొచ్చిన్ విమానాశ్రయం నుండి 4.30 గంటలు బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు.
వసతి సౌకర్యం:
ఫోర్ట్ మున్నార్,చిన్న కనల్ పోస్ట్ రూ.1800-4350 ఫోన్ 04865-849311/12
కే.టి.డి.సి. హిట్ రిసార్ట్స్ రూ 2700-6000 ఫోన్ 04865-9230460, 230969
ఎలినియం గార్డెన్స్, టాప్ స్టేషన్ రోడ్, రూ 1000-1500
ది రెసిడెన్సి, టాప్ స్టేషన్ రోడ్ రూ 1000-2200, ఫోన్: 04865-530501/2/3/4
స్టెర్న్ హాలిడే రిసార్ట్స్ (ఇండియా) లిమిటెడ్, సూరియనల్లి రూ 1700 - 2050 ఫోన్ 04865-849205/ 206/ 207/ 208
మిషా హాలిడే హోం, మిషా జంక్షన్ రూ 800-1200
Comments
Post a Comment