వేసవి కాలం సాయంకాలం పూట, ఇంట్లో ఊక్కపోతగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుంది.... అలా బయట వసారాలో కూర్చుని టి.వి చూస్తుని వున్నాను. ఈ రోజు జరగాల్సిన IPL మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది. అలా అన్నీ చానల్స్ మారుస్తున్నపుడు, మా మూవీస్ టి.వి. ఛానల్ లో “ నిన్నే పెళ్ళాడతా” సినిమా వస్తూవుంది. ఒక పాట వినిపించింది .. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను... కానీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట అది..... “ఎటో వెళ్లి పోయింది మనసు”... అది వినగానే నా మనసు ఎటో వెళ్లి పోయింది... ఇలా వెళ్లటం మొదటి సారి ఏమి కాదులే గాని... ఈ పాట విన్నపుడు మాత్రం....నిజం గానే ... ఎక్కడికో వెళ్ళిపోతాను... వెంటనే గిటార్ తీసి కొంచెం సేపు అలా మీటుతూ, పాడి పరవశించి పోయాను...
సీతారామశాస్త్రి సాహిత్యం, సందీప్ చౌతా సంగీతం, రాజేష్ గానం, కృష్ణ వంశీ దర్శకత్వం, నాగార్జున – టబు ల అభినయం వెరసి.... ఒక చక్కటి పాట.... మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యం గా వయసులో ఉన్న ఒంటరి వాళ్లు ఉహల్లో ఎటేల్తారో మీ ఊహలకే వదిలేస్తున్నాను. అలా పాట మొత్తం విన్నాకా... లిరిక్స్ రాయాలి అనిపించింది... సీతారామశాస్త్రి గారు ఈ పాట ఎలా వ్రాసారో తెలియదు గాని... నిజంగానే చల్లగాలి నా మనసు ఏక్కడికేళ్లిం ఆచూకి తీసి కబురంపింది. నేను ఒక తన్మయత్వం లో వింటున్నప్పుడు కొన్ని జ్ఞాపకాల దొంతర్లు.. పొరలు పొరలు గా వస్తున్నప్పుడు విన్న పాట.. ఒక జ్ఞాపకం గా వుండాలని నా బ్లాగు లో రాస్తున్నాను.
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
ఎటో వెళ్లి పోయింది మనసు....
ఎటో వెళ్లి పోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో...
ఎటో వెళ్లి పోయింది మనసు...
ఎటేళ్లిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో...
ఏమైయిందో... ఏమైయిందో.. ఏమైయిందో
చరణం 1:
ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామా తెలియగానే రెక్కలోచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్లి పోయింది మనసు....
ఎటో వెళ్లి పోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో...
చరణం 2:
కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభామండీ...
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకేందుకండీ...
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది... అంటూ..ఉఉ....

Comments
Post a Comment