Skip to main content

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు.
రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు. 






Discover more Telugu song lyrics → movirock.com/lyrics

ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న...
నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో.....
అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి.
ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్యూన్ చెప్పలేనంత బాగుంది.
ఇంత మంది ప్రతిభావంతులు కలిసి చేసిన ఈ పాట లిరిక్స్ మీ కోసం............

 

ఊప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండే ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో
తీయ్యనైన ఈ బాధ కి ఉప్పునీరు కంట దేనికో
రెప్ప పాటు దూరనికె విరహం ఎందుకో
నిన్ను చుసే ఈ కళ్ళకి లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ఈ ప్రేమ కి ఇన్ని శిక్షలు ఎందుకో...

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా

ఊప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండే ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో............

కనులలొ కోస్తావు.. కలలు నరికేస్తావు
సెకను కొసారైన చంపేస్తావు
మంచులా వుంటావు.. మంట పెడుతుంటావు
వెంట పది నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి ......పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకొకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి...

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా

ఊప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండే ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో............

చినుకులె నిన్ను తాకి మెరిసిపోతానంటే...మబ్బులె పోగేసి.. కాల్చేయనా
చిలకలె నీ పలుకు తిరిగి పలికాయంతే....తోలకరే లేకుండా పాతేయనా..
నిన్ను కోరి పూలు తాకితే....నరుకుతాను పూల తోటనే...
నిన్ను చూస్తే వున్నా చోటనే తోడేస్తా ఆ కళ్ళనే...

ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా

ఊప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండే ఏమిటో
చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో............


 

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...