Skip to main content

Love in Amsterdam



 


ఇది ఒక ప్రేమ కథ ... అమ్ స్టర్ డ్యాం లో జరిగింది.  అమ్ స్టర్ డ్యాం అంటే అందరికి గుర్తుకు వచ్చేది ... tulips... daffodils... అందమైన పువ్వులు... కానీ ఇది చదివిన తరువాత అక్కడ జరిగిన ఈ ప్రేమ కథ... మాత్రమే గుర్తుకొస్తుంది.
నేను M.S(Software Engineering) ని UK లో చేస్తున్నాను. UK ఉండి లో 8 నెలలు అవుతుంది. అక్కడ ఉన్న అన్నీ  రోజులు ఇండియా కి ఎప్పుడు వెళ్తానో అనిపించేది. నేను చాలా మందిని చూశాను. ఒక్కొకరు రెండు, మూడు సంవత్సరాల నుండి ఇండియాకి వెళ్ళని వారిని, అయినవాళ్ళు ఎలా ఉంటారో అనిపించింది. నేను Edinburgh (UK)  నుంచి ఇండియా కి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అంటే ఎంత సంతోషమో చెప్పలేను.అది వేరే దేశం లో వుండే వారికీ ఖచ్చితంగా తెలుసు. నేను KLM Travels  లో టికెట్ బుక్ చేసుకున్నాను. నా ప్రయాణం Edinburgh to Amsterdam to Hyderabad మీదుగా సాగింది. Edinburgh నుంచి Amsterdam కి గంటన్నర ప్రయాణం. విమానం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. అందమైన ఎయిర్ హోస్టెస్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చింది. అది తింటూ వుండగానే Amsterdam వచ్చింది. Schiphol Airport, Amsterdam లో రెండు గంటల waiting. హైదరాబాద్ విమానం 2 గంటల తరువాత బయలుదేరుతుంది.





2 గంటలే కదా ఎంతో సేపు పట్టదులే అనుకుంటువుండగా ఒక announcement వచ్చింది. హైదరాబాద్ వెళ్లవలసిన KLM-402  విమానం 4 గంటలు ఆలస్యం గా బయలుదేరుతుంది. అది వినగానే... ఛ.. పోద్దునే ఎవరి ముఖం చూసాను అనుకున్నాను. అప్పుడు గుర్తొచింది... నా ముఖమే చూసుకున్నాను అని. Airport లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను . ఏమైనా కొందాం అని, షాప్స్ తిరుగుతున్నాను.కొన్ని books మరియు DVD player with screen కొన్నాను. ఎయిర్ పోర్ట్ లో తిరిగి తిరిగి అలసిపోయాను. ఎవరో చెప్పారు Amsterdam  లో pizza బాగుంటుందని. ఇక లాభం లేదని నా టెర్మినల్ 42 దగ్గర ఒక pizza కొనుక్కొని కూర్చున్నాను. అది తిని కొంచెం సేపు అలా కూర్చున్నాను. అప్పుడే ఒక చిన్న అలజడి. నూయార్క్ నుంచి ఒక విమానం వచ్చింది. అందులో చాలా మంది భారతీయులు, ఇండియా వెళ్ళేవారు ఉన్నారు. అందరు వచ్చి lounge లో కూర్చున్నారు.


నేను అందరిని చూస్తుండగా ఒక నవ్వు ... కిలకిలమంటూ వినపడింది.వెనక్కి తిరిగి చూసాను. ఒక అందమైన అమ్మాయి. Shakespeare Movie “Romeo & Juliet“ హీరోయిన్ లాగా ఉంది. సన్నగా మెరుపు తీగలాగా వుంది. ఆమె కళ్ళు అద్భుతం. ఆమె చెవులకి పంజరాలు పెట్టుకుంది అవి గాలికి అటు ఇటు ఊగుతూన్నాయి. అందమైన నీలం రంగు సల్వార్ కమీజ్, తెల్ల చున్ని వేసుకుంది . ఆ డ్రెస్ వల్ల ఆమెకి అందం వచ్చిందో , ఆమె వాళ్ళ డ్రెస్ కు అందం వచ్చిందో అర్ధం కాలేదు.ఇంత అందమైన అమ్మాయి చూశాను, పొద్దునే ఎవరి ముఖం చూశానో,... హహ్హహ్హా నా ముఖమే.....ఆ అమ్మాయి ప్రక్కనే ఉన్న పిల్లలతో అడుతూవుంది. ఆమె  ఎక్కడికి వెళ్ళిన నా కళ్ళు ఆమెనే ఫాలో చేస్తున్నాను. sudden గా ఆమె నన్ను చూసింది. ఆమె చూసిన చూపు... సూటిగా నా గుండెల్లో గుచ్చుకుంది. నాకు ఏదో అయీపోయింది. నేను అలా చూస్తూనే ఉంది పోయాను. ఆమె కుడా అలా చూసింది.నేను వెళ్లి మాట్లాడాలని అనుకున్నాను. కానీ చుట్టూ చాలా మంది వున్నారు. ఆమె తో మాట్లాడే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అనుకుంటూ చూస్తున్నాను. ఆమె అందరితో మాట్లాడుతూవుంది కాని నన్నే గమనిస్తూవుంది.  అలా గమనిస్తున్నపుడు ఏదో తెలియని ఆనందం.. గాలిలో తెలిపోతున్నట్టు ఉంది. చూడకపోతే నా గుండె ఆగిపోతుందేమో అన్నట్టు ఉంది. ఎవరు ఈమె, నన్ను ఎందుకు ఇలా చూపులతో చంపేస్తుంది.అయిన ఒక అమ్మాయి ఎవరో తెలిదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆమె స్వభావం తెలిదు. అయిన ఎందుకని ఆమె నే చూడాలి అనిపిస్తుంది. ఆమె తో మాట్లాడాలని అనిపిస్తుంది...ఇంతకు ముందు చాలా మంది అందమైన అమ్మాయిలను చూశాను కానీ ఎవ్వరిని చూడగానే ఇలా ఫీల్ అవ్వలేదు. ఈ భావనకు అర్ధం ఏమిటి, Infatuation? ఆ వయస్సు ఎప్పుడో దాటి వచ్చాను. మరి ప్రేమ.... అవును ఇది ఖచ్చితంగా ప్రేమే..... అలా అనుకోగానే....  ఊహలలో తెలిపోయాను

నా భావావేశాన్ని.. ఒక పాట లేక కవిత లేక ఏదైనా అనుకోండి...

"నీ కళ్ళలో ఏదో మాయ ఉంది అది నన్ను నీవైపు లాగింది
నీ కళ్ళలో ఏదో గమత్తు ఉంది అది నీ మత్తు లో ముంచింది
వాలుచూపులతో  గాలం వేసి నన్ను పట్టేస్తావు


నీ నవ్వుల  తేనెలో తేలిపోతున్నా.
నీ చూపుల వెన్నెలలో పరవశించిపొతున్నా.
ఎంతో చెప్పాలని వుంది కానీ  ఏమీ చెప్పా లేకపోతున్నా..
నాకు నేనే మాట్లాడుతు పిచ్చి వాడినౌతున్నా...


నీతో  వెన్నెల వెలుగును వెంట తీసుకోస్తావు.
నిన్నుచూసి  జాబిలి కూడా జెలసీగా ఫీల్ అవుతుంది.
నీ వాలు కళ్ళ బాణాలతో నా హృదయాన్ని గుచ్చేస్తావు
ఆ చూపుల వర్షంలో నేను తడిచిపోతున్నాను.


నీ కళ్ళలో ఏదో మాయ ఉంది అది నన్ను నీవైపు లాగింది
నీ కళ్ళలో ఏదో గమత్తు ఉంది అది నన్ను మత్తు లో ముంచింది
వాలుచూపులతో  గాలం వేసి నన్ను పట్టేస్తావు



కుర్చీలో లేచి ఎక్కడికో వెళ్తుంది. ఇదే మంచి ఛాన్స్ అని వెంబడించాను.  Perfume Shop లో కి వెళ్ళింది. నేను కూడా ఆమెని అనుసరిస్తూ వెళ్ళాను. ఆహా ఏమి సువాసన, ఆ ప్రదేశం మొత్తం సుగంధ పరిమళం వెల్లి విరుస్తుంది. అది ఆమె shop లో వెళ్లినందు వల్ల అయివుంటుంది. ఆమె నన్ను గమనించింది. నన్ను రమ్మని పిలిచినట్టు అనిపించింది. నేను తెలియని మాయలో(Trance) పడివున్నాను.ఏ మాయ చేసావో. నా కంట్రోల్ నా దగ్గర లేదు. ఆమె ను చూడగానే నా కంట్రోల్ ఆమె కళ్ళలో కి వెళ్లి పోయింది. అంత అందమైన కళ్ళు ఆమెవి. ఏదో perfume bottle(ఏదో వంక తో ) రాక్ లో తీసికుని సేల్స్ మెన్ దగ్గరికి వెళ్ళాను. ఆమె అక్కడే ఉంది. how much is this?అన్నాను. అతను ప్లీజ్ వెయిట్ సర్  అన్నాడు. ఆమెతో మాట్లాడు తున్నాడు. ఆమె పెర్ఫుమ్ ఎంత అని అడిగింది? 30 యురోస్ అన్నాడు. ఆమె తన పర్స్ లో నుండి క్రెడిట్ కార్డ్ తీసి ఇస్తుంటే అది జారి నా కాళ్ళ దగ్గర పడింది. అదృష్టం అంటే నాదే అనుకున్నాను.(కావాలని పడేసిందేమో?). వెంటనే కార్డు మీద పేరు చూశాను ,” మీనా జూలియట్”. ఆమె కళ్ళకు తగ్గట్టు పేరు. ఆమె కు ఈ పేరు అనుకున్నాక పుట్టిందో లేక పూట్టకా పెట్టరో! సరిగ్గా సరిపోయింది. నేను ఇంతవరకు అంత అందమైన కళ్ళు చూడలేదు. ఆమె వెంటనే థాంక్స్ చెప్పింది. నేను వెల్ కం అన్నాను. where are you from అని అడిగాను. హైదరాబాద్ అంది. అంటే తెలుగు వాళ్ళు అన్నమాట అన్నాను. ఆమె నవ్వి అవునండి. మీరు అని అడిగింది. నా పేరు కాంత్ ...రజనికాంత్ అన్నాను. ఆమె వెంటనే నవ్వింది. మీరు మీ పేరు చెప్పలేదు అన్నాను. (నాకు తెలియన్నట్టు). మీనా అంది. ఎంత తియ్యటి స్వరం....ఇంతలో సేల్స్ మెన్ పానకం లో పూడక లా వచ్చి  ... do u need any help sir అన్నాడు నేను చిరాగ్గా ... నా చేతిలో ఉన్న బాటిల్ ఇచ్చాను. సర్  40 యురోస్ అన్నాడు. . ఆమె bye అని నవ్వుతూచెప్పి వెళ్ళిపోయింది. (ఆ నవ్వులో కొంటెతనం). ఆమె కోసం వచ్చినందుకు 40 యురోస్ వృధా అనుకుంటారు... కానీ ఆమెతో మాట్లాడితే చాలు..ఎంత ఐయిన పోనీ అనిపించింది ఆ క్షణంలో. వెంటనే బిల్ ఇచ్చి బయటకు వచ్చాను. చూస్తే కనపడలేదు. అన్నీ వైపులా చూశాను, కనపడలేదు. పక్కన చాక్లేట్ షాప్ కనిపించింది. అప్పుడు నాకు అమ్మ స్విస్ చాక్లేట్స్ ఫోన్ లో చెప్పిన విషయం గుర్తొచింది. సర్లే అని షాప్ లోపలికి వెళ్ళాను. Swiss Choclates ఎక్కడున్నాయని సేల్స్ గర్ల్ ని ఆమె కార్నర్ లో ఉన్నాయని చెప్పింది. నేను ఆమె గురించే ఆలోచిస్తూ కార్నర్ కి వెళ్ళాను.నాకు షాక్. Oh My God. ఆమె అక్కడే ఉంది. వెంటనే అమ్మకి థాంక్స్ చెప్పాలి అనుకున్నాను. లేక పోతే ఈ ఛాన్స్ మిస్ చేసే వాణ్ణి. అక్కడకు వెళ్లి హాయ్ మీనా అన్నాను. హాయ్ అంది ..( కానీ కొంచెం Serious Expression, తనని follow చేస్తున్నానని అనుకుంది. ఈ అమ్మాయిలంతా ఇంతే ఎప్పడు అర్ధం చేసుకోరు). What a surpraise? అన్నాను. (ఏదో 5సంవత్సరాల తరువాత కలుస్తున్నట్టు!) ఏదో ఆ అమ్మాయి కనపడిన ఆనందం లో అలా అనేసాను. yeah అంది. ఎంతో మాట్లాడాలని వుంది ... ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఏదో మాట్లాడాలని మీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా అన్నాను.( చాలా చెత్త ప్రశ్న.. అమ్మాయి... అన్నం లేకపోయిన పరవాలేదు.. చాక్లెట్స్ వుంటే చాలు). ఆవును అంది. నాకు కూడా చాలా ఇష్టం అన్నాను...( ఆమె నన్ను అడగలేదు). మీరు ఏమి చదువుతున్నారు అన్నాను. ఆపులేక. B.Tech చేశాను. IAS prepare అవుతున్నాను అంది. wow ..great అన్నాను. థాంక్స్ చెప్పింది. మరి US నుంచి వస్తున్నారు. ఓహ్ అదా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాను. మీరు? అంది  అదే మీరు మీ గురించి చెప్పలేదు అంది. నేను కూడా B.Tech చేశాను. M.S చదువుతున్నాను UK లో అన్నాను. Great అంది. “Great Great Great”   ని మూడు సార్లు  రీసౌండ్ లా  విన్పించింది. చాక్లెట్స్ బిల్ పే చేసి Lounge లో వచ్చాము. ఆమె వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. నేను ఎవరో తెలియన్నట్టు.(దేవుడు ఇన్ని తెలివి తేటలు ఆడ వాళ్ళకే ఎందుకిచ్చాడో ఇప్పుడు అర్దమైంది). ఆమె తో ఇండియా వెళ్ళే వరకు మాట్లాడాలి అంటే ఒక దారి వాళ్ళ పేరెంట్స్ తో కూడా పరిచయం పెంచుకోవాలి...... ఎలా... ఎలా....ఎలా....?

(రెండవ భాగం....రేపు)

Comments

  1. Good one ra .... narration inka koncham improve cheyyi.....

    ReplyDelete
  2. Superb Story.. Waiting for 2 part

    ReplyDelete
  3. Wow bro seriously waiting for 2nd part😍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie from HitSongs.in

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie from HitSongs.in

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలోన తల దాచి జాలి

Gala Gala Paruthunna Song Lyrics- Pokiri Movie from HitSongs.in

చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ గీతరచయిత: కందికొండ నేపధ్య గానం: నిహాల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా -2 నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా - 2 గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 1: వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా హో వహోవా … నీ అల్లరి హో వహోవా హో వహోవా… బాగున్నది హో వహోవా.. గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 2: girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party girl I'm watchin' your veepi cuz to love you forever is my duty so feel it oh my baby చరణం 3: చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా హో వహోవా… ఈ లాహిరీ … హో వహోవా… హో వహోవా… నీ కే మరీ