చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: అద్నాన్ సామి
పల్లవి:
కళ్లు కళ్లు ప్లస్సు...
వాళ్లు వీళ్లు మైనస్...
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే equal to infatuation...
హేయ్... కళ్లు కళ్లు ప్లస్సు...
ఉం... వాళ్లు వీళ్లు మైనస్...
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే equal to infatuation...
Infatuation... Oh! Infatuation... Oh!...
ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు
గణిత సూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగి
పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి
పుడుతుందో ఉష్ణం... || కళ్లు కళ్లు ప్లస్సు... ||
చరణం 1:
దూరాలకి మీటర్లంట
భారాలకి కెజి్లంట
కోరికలకు కొలమానం
ఈ... జంట
సెంటిగ్రేడు సరిపోదంటా
ఫేరన్ హీట్ పని చెయ్దంటా
వయసు వేడి కొలవాలంటే... తంటా
లేత లేత ప్రాయాలలోనా
అంతే లేని అలోచన
అర్థం కాదు ఏ సైన్సు కైనా ఓ ..ఓ..
పైకి విసిరినది కింద పడును అని
తెలిపె గ్రావిటేషన్
పైన కింద తలకిందలవుతుంది infatuation... || కళ్లు కళ్లు ప్లస్సు... ||
చరణం 2:
సౌత్ పోల్ అబ్బాయంటా
నార్త్ పోల్ అమ్మాయంటా
రెండు జంట కట్టే తీరాలంటా
ధనావేశం అబ్బాయంటా
ఋనావేశం అమ్మాయంటా
కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతి స్పర్శ ప్రశ్నేనంటా
మరో ప్రశ్న జవాబటా
ప్రాయానికే పరీక్షలంటా
పుస్తకాల పురుగులు రెండంటా
ఈడు కొచ్చెనంటా
అవి అక్షరాల చక్కెర తింటూ
మైమరిచేనంటా... ఓ... || కళ్లు కళ్లు ప్లస్సు... ||
Comments
Post a Comment