For More Songs Download https://movirock.com
పల్లవి
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం...
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం....
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా...
ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా....
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం....
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం..
చరణం:1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె... (నేస్తమా నేస్తమా....)
చరణం:2
అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే .. (నేస్తమా నేస్తమా....)
For More Songs Download https://movirock.com

Comments
Post a Comment