Skip to main content

Posts

Showing posts from October, 2011

Jilibili Palukula O Maina Mainaa | జిలిబిలి పలుకుల - Sithara Movie

చిత్రం: సితార (1984) గాయకులు :  బాలు,జానకి రచయిత: వేటూరి సంగీతం: ఇళయరాజా             Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైన.. మైనా మిలమిల మెరిసిన తార.. మిన్నుల విడిన సితార.."2" మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ.. మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా..ఓ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ  మైనా.. మైనా చరణం :1 అడగనులే  చిరునామా ఓ మైనా.. ఊ మైనా చిరునవ్వె పుట్టిల్లు నీకైనా నాకైనా.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.."2" హరివిల్లు రంగుల్లో వర్ణాలే.. చిలికిన చిలకవు, ఉలకవు పలకవు, ఓ మైనా..ఏ మైనా!! చరణం: 2 ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా.. మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.."2" వినువీధి వీణంలో రాగంలా.. ఆశల ముంగిట ఉహాల ముగ్గులు నిలిపేనా ఏ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఊ మైన.. మైనా తోలకరి వయసుల మిణుగురు సొగసులదీమైనా..మైనా మిలమిల మెరిసిన తార..మిన్నులవి...

Kavali Kavali Nene Nee Lokam Kavali |కావాలి..కావాలి... మొగుడు.. - Mogudu Movie

చిత్రం: మొగుడు గాయకులు: మధుమిత, బాబు శంకర్ రచయిత: సిరివెన్నెల సంగీతం: బాబు శంకర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా అవ్వాలి... మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి... ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి.... వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... ఇంట్లో... వుంటే... కొంగు వదలవని... /2/ తిట్టే విరసం కావాలి..... గడప దాటితే ఇంకా రావని కొట్టే విరహం కావాలి.. నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి... ఆవునో కాదో అనుమానంతో నేనే మేలుకొని వుండాలి... నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి... అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి... కావాలి..ఆఈ ....ఈ ..ఈ.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... చీకటినైన చుడనివ్వనని ... చీకటినైన చుడనివ్వనని చేరి నన్ను చుట్టేయ్యాలి .... చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి .. న...

Andama Andama Anduma | అందమా అందుమా - Govinda Govinda Movie

చిత్రం:  గోవిందా..గోవిందా గాయకులు: బాలు,చిత్ర సంగీతం: కోటి   Discover more Telugu song lyrics →  movirock.com/lyrics అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరానంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా) అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా) వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా తీయతీయగా నచ్చ చెప్పనీ చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల నిలవనీడు నిదరపోడు నారాయణ వగలమారి వయసు పోరు నా వల్లన చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా).

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు.  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో ...

Eduta Nilichindi Choodu | ఎదుట నిలిచింది చూడు.... Vana Movie

    Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ అవునో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు

Manchu Kurise Vellalo | మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో - Abhinandana Movie

నాకు తెలిసి ఈ పాట విన్న ఎవ్వరైనా సరే అలా... మంచుకొండల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. అభినందన చిత్రం ఒక సంగీత మాలిక. ఈ చిత్రం లోని అన్ని పాటలు ఒక్కోటి ఒక్కో అద్భుతం అంటే అతిశయోక్తి కాదేమో...ఈ గీత రచయిత వేటూరి..నిజంగా ఒక మహా కవి..ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా అయన రాసినా ప్రతి పాట ఆయన్ని మనమద్యలో ఉంచుతుంది. వేటూరి గారు మనల్నిప్రశ్న వేస్తున్నారా? లేక ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారా? నిజంగానే...నాకు అనిపిస్తునది... మంచు కురిసినప్పుడు మల్లె పూవ్వు ఎందుకు  విరబూస్తుంది?... అలాగే ఆ సమయంలో మనసు ఎందుకు మురుస్తుంది? మనలో చాలా మందికి ఈ అనుభవం వుండదు.... వారి కోసం. వేటూరి కలం నుంచి జాలువారిన ఈ పాట . మంచు పూవ్వులను మీ మీద కూమ్మరిస్తుంది.. అలాగే ఇళయరాజా సంగీత మాంత్రికుడు.. అయన చేసే సంగీత మాయలో మైమరచి పోనివారుండరు. పాటలోని సంగీతం  మనల్ని మరో లోకం తీసుకువెళ్తుంది. Discover more Telugu song lyrics →  movirock.com/lyrics చిత్రం : అభినందన గానం: బాలు, జానకి రచన: వేటూరి సుందరరామ్మూర్తి స్వరకల్పన: ఇళయరాజా మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో.... మల్లె విరిసే మంచులో... మనస...