చిత్రం: సితార (1984) గాయకులు : బాలు,జానకి రచయిత: వేటూరి సంగీతం: ఇళయరాజా For More Songs Download https://hitsongs.in పల్లవి: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైన.. మైనా మిలమిల మెరిసిన తార.. మిన్నుల విడిన సితార.."2" మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ.. మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా..ఓ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా.. మైనా చరణం :1 అడగనులే చిరునామా ఓ మైనా.. ఊ మైనా చిరునవ్వె పుట్టిల్లు నీకైనా నాకైనా.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.."2" హరివిల్లు రంగుల్లో వర్ణాలే.. చిలికిన చిలకవు, ఉలకవు పలకవు, ఓ మైనా..ఏ మైనా!! చరణం: 2 ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా.. మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.."2" వినువీధి వీణంలో రాగంలా.. ఆశల ముంగిట ఉహాల ముగ్గులు నిలిపేనా ఏ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఊ మైన.. మైనా తోలకరి వయసుల మిణుగురు సొగసులదీమైనా..మైనా మిలమిల మెరిసిన తార..మిన్నులవిడిన సితార.. గుడికే చేరని దీపం
for More songs visit https://hitsongs.in